ధాన్యాన్ని త్వరగా కొనాలి
రాయికల్/మల్యాల: త్వరిగతిన ధాన్యం తూకం వేసి, మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మల్యాలలోని మార్కెట్‌యార్డు, ముత్యంపేట, నూకపల్లి, రామన్నపేటలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్, రాయికల్, ఇటిక్యాలలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. గన్నీసంచుల వివరాలపై ఆరా తీశారు. ఆమె వెంట రాయికల్ తహసీల్దార్ ఖయ్యూం, సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డులను పరిశీలించారు. సర్వేలో తప్పులు రానీయొద్దన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment