సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై అక్రమ కేసులు పెట్టారని.. అరెస్ట్‌చేస్తే నా దగ్గర నుంచే మొదలు పెట్టాలంటూ చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్ చేస్తాను. నాతో పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్వీట్ చేస్తారు. ఎంతమంది పైన కేసులు పెడతారో పెట్టండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. బాబు బడ్జెట్‌లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం. సోషల్ మీడియాలో బాబు మోసాలను ఎండగడతాం’’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.
‘‘ఇచ్చిన హామీలను మేం తూచా తప్పకుండా అమలు చేశాం. మేం రూ. 2 లక్షల 73 వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. ఐదేళ్లలో మేం ఆరు లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు వచ్చాక 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. 15వేల మంది బేవరేజెస్ ఉద్యోగులను తొలగించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అన్నారు. బడ్జెట్‌లో రూ.7,200 కోట్లు కనిపించలేదు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు ఇస్తానన్నాడు. బడ్జెట్ రూ. 13 వేల కోట్లు ఎక్కడా కనిపించలేదు.
..11వేల కోట్లకు గాను బడ్జెట్‌లో వెయ్యి కోట్లే కేటాయించారు. ప్రతి రైతుకు రూ. 20 వేలు సాయమన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.18 వేలు ఇస్తామన్నారు. రూ. 37,313 కోట్లకు గాను బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదు. సూపర్ సిక్స్ పథకాలన్నింటికీ చంద్రబాబు పంగనామాలు పెట్టేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారు. 110 మంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. 170కిపైగా హత్యలు, 500లకు పైగా హత్యాయత్నాలు జరిగాయి.
ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!
..680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులిచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుదేలైంది. చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ అమలుకు రూ. 74వేల కోట్లు అవసరం. చంద్రబాబు చేసిన మోసాలపై ఎందుకు 420 కేసు పెట్టకూడదు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment