సాక్షి, తాడేపల్లి: బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందని.. హామీలు ఎగొట్టడానికి బాబు అబద్ధాలకు రెక్కలు కట్టారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అన్నీ వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. బాబు హయాంలో కన్నా వైఎస్సార్‌సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి ఎక్కువగా ఉంది. లేని అప్పులు ఉన్నట్టుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేశారు. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు.’’ అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా లక్షా 30వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో 50 వేల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల వలంటీర్ల నియామకాలు చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల వలంటీర్ల ఉద్యోగాలు పీకేశారు.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షలకు పెంచాం. 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని 108 ఉద్యోగాలు ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment