సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘గవర్నమెంట్‌కు రావాల్సిన ఆదాయం ప్రైవేట్ జేబుల్లోకి వెళ్తోంది. ఇసుక రేట్లు మా ప్రభుత్వం హయాం కన్నా రెట్టిపంయింది.’’ అని చంద్రబాబు సర్కార్‌ను వైఎస్ జగన్ నిలదీశారు
గతంలో సంక్షేమ క్యాలెండర్ ద్వారా పథకాలన్నీ క్రమబద్ధంగా అందించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పథకాలన్ని అందేవి. చంద్రబాబు వచ్చాక సంక్షేమ పథకాలన్నింటికి తూట్లు పొడిచారు. అమలు చేసే పథకాలకు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే. సంక్షేమ పథకాలు అందించేందుకు చంద్రబాబు విముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా, పేకాట క్లబులు నడుపుతున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించేశారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. దోచేసిన దాంట్లో బాబుకింత, లోకేష్‌కింత, దత్తపుత్రుడికింత పంచుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!
Comments
Please login to add a commentAdd a comment