చెర్లకొండాపూర్‌లో వాటర్ ప్లాంట్
● ముందుకొచ్చిన ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ ● బోరు మంజురు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వినతి
రాయికల్: మండలంలోని చెర్లకొండాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఫాతిమనగర్ ఆడోరేషన్ సొసైటీ ముందుకొచ్చింది. గ్రామస్తుల సహకారంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ మర్రి మల్లేశం హామీ ఇచ్చారు. ‘చెర్లకొండాపూర్‌లో ఫ్లోరైడ్ భూతం..?’ శీర్షికన ఈనెల ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కరీంనగర్‌లోని ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ జిల్లా కో–ఆర్డినేటర్ మర్రి మల్లేశం స్పందించారు. బుధవారం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉ న్నందున తమ సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్ ఏ ర్పాటు చేస్తామని, దీనికి గ్రామస్తుల సహకారం ఉండాలని కోరారు. దీనికి వెంటనే గ్రామానికి చెందిన దేవుని లక్ష్మీనారాయణ రూ.30వేలు, ఆకుల లక్ష్మీనా రాయణ, ఆకుల రాజేందర్, ఆకుల రమేశ్, దువ్వాక నరేశ్, ఎశల చిన్న నర్సయ్య రూ.5 వేల చొప్పున, బాసవేని రాజిరెడ్డి, బెల్లాల బాలరాజు రూ.వెయ్యి చొప్పున, జక్కుల చంద్రశేఖర్ భూపతిపూర్ సర్పంచ్ రూ.2 వేలు అందించారు. అనంతరం గ్రామంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించి వాటర్‌ప్లాంట్ కోసం బోరు మంజూరు చేస్తే యుద్ధప్రతిపాదికన ప్లాంట్ నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పల్లికొండ రమేశ్, ఆకుల రాజందర్, నానం రాజేందర్, నర్సయ్య, రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరైడ్ సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment