మల్యాలలో బురుజు వద్ద మేక బలి
మల్యాల(చొప్పదండి): మల్యాల మండల కేంద్రంలోని బురుజు వద్ద ఏటా దసరాకు మేకను బలిస్తారు. ఇందుకోసం స్థానికుడు కై లాసం కోటి రాజయ్య ఇంట్లో ఉన్న తల్వార్‌ను తీసుకువచ్చేందుకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో వెళ్తారు. బలి కార్యక్రమం పూర్తయ్యాక కోలాటం ఆడుతూ కొత్తపేటలోని జమ్మిచెట్టు వద్దకు వెళ్తారు. కొమ్మలు కొట్టి, ఆకులు(బంగారం) తెంపుకొని, ఒకరికొకరు పంచుకుటూ ఆలింగనం చేసుకుంటారు. అయితే, 30 ఏళ్ల క్రితం దసరా రోజు మద్యం మత్తులో జరిగిన గొడవతో స్థానికులు రెండు వర్గాలు విడిపోయారని, ఓ వర్గం తూర్పువాడలోని మరో జమ్మిచెట్టు వద్దకు వెళ్తోందని స్థానికుడు గడ్డి దుబ్బయ్య తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment