● ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● సమగ్ర కుటుంబ సర్వేపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
జగిత్యాల: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటోందని, వివరాల నమోదు చాలా కీలకమని, పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన వనరుల శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇంటింటి కుటుంబ సర్వేపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు. సర్వేలో పట్టణ ప్రాంతాల్లో డోర్‌లాక్, కొందరు ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయని , వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయాలని సూచించారు. సర్వేకు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లిన వారి వివరా లను జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోవాలని తెలి పారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అవుతున్నాయని, దీనిపై సీఎంతోపాటు కేబినెట్ ప్రత్యేక దృష్టిపెట్టిందని తెలిపారు. ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తకుండా కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందన్నారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment