లక్ష డప్పులతో వర్గీకరణ ఆకాంక్ష చాటుదాం | - | Sakshi
Sakshi News home page

లక్ష డప్పులతో వర్గీకరణ ఆకాంక్ష చాటుదాం

Published Fri, Jan 31 2025 1:05 AM | Last Updated on Fri, Jan 31 2025 1:05 AM

లక్ష డప్పులతో వర్గీకరణ ఆకాంక్ష చాటుదాం

లక్ష డప్పులతో వర్గీకరణ ఆకాంక్ష చాటుదాం

గద్వాలటౌన్‌: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను మాల సామాజికవర్గ పెద్దలు అడ్డుకుంటున్నారని, వారు స్పష్టించే ఆటంకాలను అధిగమించేందుకు.. వర్గీకరణ ఆకాంక్ష చాటేందుకు ‘లక్ష డప్పులు.. వేల గొంతుల’తో నినదించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోరుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో చేపట్టనున్న ‘వేల గొంతుకలు.. లక్ష డప్పుల’ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం రాత్రి 8.30 గంటలకు గద్వాలలో సన్నాహక ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో డప్పులతో తరలివచ్చిన ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు, ప్రజలు పట్టణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోని మాల సామాజికవర్గ ఎమ్మెల్యేలు, తదితరులు వర్గీకరణను అడ్డుకుంటున్న వారికి రాజకీయ గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే రాష్ట్రంలో వర్గీకరణను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. తరువాత అమలులో జాప్యం చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ వర్గీకరణను అడ్డుకుంటున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 30 ఏళ్ల పోరాటాలు, కార్యకర్తల త్యాగాలతోనే వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ఇప్పటికే పంజాబ్‌, హరియాణ, తమిళనాడులో ఆ తీర్పును అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వర్గీకరణ లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో జరిగే సభకు ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు చొప్పున తీసుకొచ్చి రాజధానిలో ‘లక్ష డప్పులు.. వేల గొంతుల’తో నినదించాలని మంద కృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మార్పీఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

డప్పుల దరువుతో మార్మోగిన గద్వాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement