హామీల అమలు విస్మరించిన కాంగ్రెస్
గద్వాల టౌన్: కాంగ్రెస్ పార్టీ నాయకులు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కుర్వ విజయ్‌కుమార్, బాసు హనుమంతు ధ్వజమెత్తారు. ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్యాబినెట్‌లో సీఎం, మంత్రుల చేప్పే మాటలకు పొంతన ఉండటం లేదని మిమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఫాంహౌజ్ పాలన కావాలా? ప్రజా పాలనా కావాలనా? అని పోల్ పెడితే యావత్ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలన్నారు. సోషల్ మీడియాలో ఇంత వ్యతిరేకత ఉంటే క్షేత్రస్థాయిలో మరింత వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం రైతు భరోసా అమలులో నిర్లక్ష్యం చేస్తోందని, రైతు కూలీలకు రూ.12 వేల జీవనభృతి ఏమైందని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణమాఫీ అరకొరగా చేసి.. వందశాతం పూర్తిచేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పారని, వరికి ఇచ్చే బోనస్‌పై బోగస్ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మోసగించారని విమర్శించారు. మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ వాహనం అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తునే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మోనేష్, శేఖర్‌నాయుడు, బీచుపల్లి, రాజు, శ్రీరాములు, శ్రీనివాసులు, పరశురాముడు, తిమ్మప్పగౌడ్, మునిమౌర్య, శ్రీనివాస్, మక్బుల్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment