కొత్తపల్లి: మండలంలోని కేఎస్‌ఈజెడ్ పరిధిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) కాకినాడ క్యాంపస్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. ప్రస్తుతం కాకినాడలో ఉన్న జేఎన్‌టీయూలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నామని, ఐఐఎఫ్‌టీ సంస్థకు త్వరలో అన్ని సౌకర్యాలతో పూర్తిస్థాయి పరిపాలన, బోధన అందించేందుకు భవన నిర్మాణాలకు ఈ స్థలాన్ని పరిశీలించినట్లు బృందం సభ్యుడు పీయూష్ కుమార్ తెలిపారు. ఆయన వెంట ఆర్డీఓ బి.రమణమూర్తి, తహ సీల్దారు ప్రసాద్, జేఎన్‌టీయూ ఐఐఎఫ్‌టీ ప్రతి నిధులు బాబూరావు, నాయుడు ఉన్నారు.
ధర్మరక్షణే స్వీయరక్షణ
గండేపల్లి: ధర్మరక్షణే వ్యక్తిగత (స్వీయ) రక్షణ అని బీహార్‌లోని శ్రీయోగి పీఠం స్వామీజీ, హింధూ మహాసభ జాతీయ కార్యదర్శి అతిథేశ్వరానంద స్వామీజీ అన్నారు. మండలంలోని తాళ్లూరు జీయ్యన్న మఠాన్ని ఆయన బుధవారం సందర్శించారు. మఠంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ధర్మమే రక్షిస్తుందని తెలిపారు. తొలుత స్వామిజీకి తాళ్లూరు మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు స్వాగతం పలికారు. ఆయన వెంట అఖిల భారత హింధూ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు రాజరాజేశ్వరానందస్వామి, కార్యదర్శి గీతాప్రకాశనంద స్వామి, ఉప్పలపాడు ఆలయ అర్చకుడు వి.నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
5న రాష్ట్ర స్థాయి
ఎడ్ల పరుగు ప్రదర్శన
పిఠాపురం: శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించనున్నట్లు స్థానిక శ్రీసీతారామ ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహణ కమిటీ తెలిపింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. చేబ్రోలులో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అడవి పుంత రోడ్డులో ఈ పోటీలు జరుగుతాయ న్నారు. ఆసక్తి కలిగిన ఎడ్ల జతల యజమానులు పూర్తి వివరాలకు 99490 48799, 73861 58715 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment