సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో అన్నదానానికి తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధం పి సత్యసూర్యనారాయణ, రత్నలీల దంపతులు రూ.3,03,348 బుధవారం విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ముగ్గురి పేరిట ఈఓ డి నాగమల్లేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్బంగా దాతలకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈఓ నాగమల్లేశ్వరరావు స్వామి వారి ఫోటో ప్రసాదం అందజేశారు.
40 పరిశ్రమల్లో
తనిఖీలు పూర్తి
కాకినాడ సిటీ: జిల్లాలో 40 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. పరిశ్రమలు, ఏపీఐఐసీ, గ్రౌండ్ వాటర్, రవాణా, అగ్నిమాపక, పంచాయతీ, కార్మిక, ఫ్యాక్టరీస్, ట్రాన్స్‌కో, పొల్యూషన్, రవాణా తదితర శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి పరిశ్రమల ప్రొత్సహక కమిటీ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. హానికర కేటగిరీ, రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో ఏటా ప్రత్యేక బృందం విస్తృతస్థాయిలో తనిఖీలు చేపడతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 57 పరిశ్రమలకు గాను 40 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పరిశ్రమల్లో త్వరగా తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు ఏకగవాక్ష విధానంలో 67 దరఖాస్తులను కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 29 యూనిట్లకు రూ.3.81 కోట్లు మంజూరయ్యాయన్నారు.
15న వికాసలో
ఇంటర్వ్యూలు
కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈనెల 15వతేదీన టెక్ మహేంద్ర కంపెనీలో అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ (వాయిస్ ప్రోసెస్ తెలుగు) ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు బుధవారం వివరించారు. ఈ ఉద్యోగానికి గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన 30 ఏళ్ల లోపు సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేలు జీతం, క్యాబ్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికై నవారు చైన్నెలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులందరూ ఈనెల 15న కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు.
17న స్టడీ అబ్రాయిడ్
ఫెయిర్–23
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విదేశాల్లో ఎంబీఏ,ఎంసీఏ కోర్సులు చేయాలనుకునే వారికి సలహాలు,సూచనలు,కోర్సు,ఫీజు తదితర వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి,ఆప్స్కిల్స్ సంకల్పించాయి. ఈ రెండూ సంయుక్తంగా స్టడీ అబ్రాడ్ ఫెయిర్–23 పేరుతో ఈ నెల 17న ఇందుకు శ్రీకారం చుడుతున్నాయి. జేఎన్టీయూకే ఇందుకు వేదిక కానుంది. ప్రభుత్వ కళాశాలలతో పాటు వర్సిటీకు అనుబంధంగా ఉన్న ఎనిమిది జిల్లాల ప్రైవేట్ ఇంజినీరింగ్,మేనేజ్మెంట్ సంస్థల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. అబ్రాడ్ ఫెయిర్ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తిచేసిన లేదా ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఫెయిర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రారంభిస్తారని జేఎన్టీయూకే వీసీ డాక్టర్ ప్రసాదరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment