స్వామివారిని దర్శించిన 50 వేల మంది
అన్నవరం: శ్రావణమాస తొలి శనివారం, శుద్ద తదియ పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు సత్యదేవుని దర్శించేందుకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 60 వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు. స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తు లతో నిండిపోయాయి. సత్యదేవుని ప్రదక్షిణ దర్శ నానికి గంట, సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యో తులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు నాలు గు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సుమారు నాలుగు వేల మంది భక్తులు పాల్గొన్నా రు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మిసత్యవతి అమ్మవార్లకు తిరుచ్చి వాహనంపై ఊరేగించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ప్రతిష్టించి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణం మూడు సార్లు ప్రదక్షిణ చేయించిననంతరం మళ్లీ పూజలు చేసి తిరిగి ఆలయానికి చేర్చారు.
జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
కాకినాడ: జిల్లా వైఎస్సార్ సీపీ ప్రచార, వైద్య విభాగాలకు అధ్యక్షులు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం వీరి నియామకాలను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ మాజేటి మల్లికార్జున్ నియమితులయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తూ మూడేళ్ల కిందట ఆయన ఉద్యోగ విరమణ పొందారు. నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రామ్ అధికారిగా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా కూడా పనిచేశారు. ఇమ్యూనైజేషన్లో 96 శాతం ఫలితాన్ని సాధించి జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాలిక చిన్న అప్పారావు కాకినాడ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన పదేళ్లుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment