కాకినాడ క్రైం: జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తిమ్మాపురం ఎస్సై కె.నాగార్జునరాజు జగ్గంపేటకు బదిలీ అయ్యారు. కాకినాడ వన్ టౌన్ శాంతిభద్రతల ఎస్సై కె.షరీఫ్‌ను తిమ్మాపురంలో నియమించారు. వీఆర్‌లో ఉన్న పీసీవీ స్వామినాయుడుకు యు.కొత్తపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పని చేస్తున్న ఎన్.రామలింగేశ్వరరావును తుని బదిలీ చేశారు. ఆర్.మురళీమోహన్ను తుని నుంచి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అక్కడి ఎస్సై బి.జగన్మోహన్రావును, సామర్లకోట ఎస్సై టి.సునీతను వీఆర్‌లో ఉంచారు. కాకినాడ సీసీఎస్‌లో పని చేస్తున్న పీవీఆర్ మూర్తి, సర్పవరం ఎస్సై సతీష్బాబును సామర్లకోట బదిలీ చేశారు.
డీఐఓగా డాక్టర్ రత్నకుమార్
కాకినాడ క్రైం: జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి(డీఐఓ)గా డాక్టర్ కె.రత్నకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన న్యూరాలజీ నిపుణుడు. కాకినాడ జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో 12 ఏళ్ల పాటు పని చేశారు. సాధారణ బదిలీలో భాగంగా 2022 మార్చిలో విశాఖపట్నం కేజీహెచ్‌కు బదిలీపై వెళ్లారు. అదే హోదాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పని చేశారు. ఈ నెల 4వ తేదీన డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో వ్యాధి నిరోధక టీకాల అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్‌ను కలిసి డాక్టర్ రత్నకుమార్ జాయినింగ్ రిపోర్టు సమర్పించారు.
11న జాబ్‌మేళా
కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖజానా జ్యూయలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, ఆఫీస్ అసిస్టెంట్లు, ముత్తూట్ ఫైనాన్స్‌లో ఇంటర్న్‌షిప్, ప్రొబేషనరీ ఆఫీసర్లు, జీకే గ్రూప్స్‌లో క్వాలిటీ కంట్రోల్, అకౌంట్స్ అండ్ కలెక్షన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, అపర్ణ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ ప్రొడక్షన్, అపోలో టైర్స్, డిక్సన్, హ్యూండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే డీడీయుజీకేవై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తామని లచ్చారావు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ‘చిలుకూరి’
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చిలుకూరి రామ్‌కుమార్‌కు పార్టీ అధిష్టానం రెండోసారి బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా 2019 డిసెంబర్ నుంచి ఆయన పని చేశారు. తనకు రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు జాతీయ నాయకులకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా రెండోసారి నియమితులైన రామ్‌కుమార్‌ను పార్టీ జిల్లా నాయకులు అభినందించారు.
వనదుర్గ అమ్మవారికి
చండీ హోమం
అన్నవరం: రత్నగిరిపై వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి హోమం ప్రారంభించారు. 11 గంట లకు పూర్ణాహుతి గావించి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు ప్రసాదా లు పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహి త్ పాల్గొన్నారు. వేద పండితులు హనుమంతువఝల అమరయ్య, ఉపాధ్యాయుల రమేష్, అర్చకులు దత్తాత్రేయ శర్మ, యండవిల్లి ప్రసాద్, చెల్లపిల్ల ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు.
అమ్మవారికి లక్ష కుంకుమార్చన
ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment