జైగణేష్‌ లడ్డు పాట రూ.47,500 | - | Sakshi
Sakshi News home page

జైగణేష్‌ లడ్డు పాట రూ.47,500

Published Wed, Sep 27 2023 2:44 AM | Last Updated on Wed, Sep 27 2023 2:44 AM

- - Sakshi

పిఠాపురం: పిఠాపురంలో ప్రముఖ వినాయక దేవాలయం జైగణేష్‌ ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డును భక్తులు వేలంలో రూ 47500లకు పాడుకున్నారు. ఆలయంలో మంగళవారం లడ్డు పాట నిర్వహించారు. పిఠాపురం మండలం జల్లూరుకు చెందిన కోలా రాజు, వీరంరెడ్డి చక్రిలు లడ్డును పాడుకున్నారు. ఈకార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

డయల్‌ యువర్‌

కలెక్టర్‌కు 13 అర్జీలు

కాకినాడ సిటీ: డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జేసీ ఎస్‌ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆమె డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 13 మంది సంక్షేమ పథకాల లబ్ధి, విద్య, ఉపాధి, భూ సర్వే, భూ సమస్యలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌ 18004253077కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేశారు. ఫోన్‌ ద్వారా తెలియజేసిన సమస్యలను నాణ్యతతో గడువులోగా పరిష్కరించాలన్నారు. 13 మంది వ్యక్తుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపామన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో కె శ్రీధర్‌రెడ్డి, ఏవో జీఎస్‌ఎస్‌ శ్రీనివాసు, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.

నేడు సామూహిక

ఎలుకల నిర్మూలన

గండేపల్లి: జిల్లా పరిధిలోని ప్రతి మండలంలోనూ బుధవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని యర్రంపాలెంలో మంగళవారం ఆయన వ్యవసాయ క్షేతస్థాయి పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 75శాతం ఈ–క్రాప్‌ నమోదు పూర్తయిందన్నారు. ఈ నెల 30 నాటికి నూరుశాతం పూర్తి చేస్తామన్నారు. ఈయన వెంట ఏడీఏ వైవి గంగాధర్‌ కుమార్‌, గండేపల్లి, జగ్గంపేట ఏఓలు ఏ సద్గురుమూర్తి, శ్రీరామ్‌, హబ్‌ఏఓ కరుణాకర్‌ రాజు, రైతులు ఉన్నారు.

ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు

రాజమహేంద్రవరం సిటీ: రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలోఆర్టీసీ బస్సుల రాకపోకలను దారి మళ్లించినట్లు రాజమహేంద్రవరం డిపో మేనేజర్‌ షేక్‌ షబ్నం మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి అక్టోబరు 26వ తేదీవరకూ ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిడ్జిపై నుంచి వచ్చే కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల బస్సులు ఈ నెల రోజులూ గామన్‌ బ్రిడ్జి, కాతేరు, కంబాల చెరువు మీదుగా రాజమహేంద్రవరం డిపోకు రాకపోకలు సాగిస్తాయన్నారు. తాడేపల్లి గూడెం, తణుకు, నిడదవోలు డిపోల బస్సులు విజ్జేశ్వరం బ్యారేజి, బొబ్బర్లంక, ధవళేశ్వరం, రైల్వేస్టేషన్‌, కోటిపల్లి బస్‌స్టాండు మీదుగా రాజమహేంద్రవరం కాంప్లెక్సుకు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించి సహకరించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లడ్డు పాడుకున్న భక్తులు1
1/2

లడ్డు పాడుకున్న భక్తులు

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి2
2/2

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement