ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి వాడపల్లి శ్రీవేంకటేశ్వర వాసవీ నిత్యాన్నదాన ట్రస్టు తరఫున ఆ ట్రస్టు చైర్మన్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ఆయనకు ఆలయ అర్చకులు తొలుత స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత స్వామివారి చిత్రపటం బహూకరించారు.
జానపదాల్లోని రామకథలు
ప్రమాణాలు కావు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వేదాల నుంచి జానపద సాహిత్యం వరకూ రామకథ విస్తరించిందని, అయితే జానపదంలో కనిపించే రామకథలన్నీ వాస్తవాలు, ప్రమాణాలు కావని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో ఆయన బుధవారం 22వ రోజు శ్రీరామాయణ ప్రవచనం కొనసాగించారు. ‘సీతారామలక్ష్మణుల వనవాస సమయం 14 ఏళ్లూ లక్ష్మణుని భార్య ఊర్మిళ నిద్రపోయిందని, లక్ష్మణుడు అన్ని ఏళ్లూ నిద్రపోలేదని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఇది జానపద సాహిత్యం కల్పన. రాముని వెంట అడవులకు వెళ్లిన సీత ఎంత పతివ్రతో, లక్ష్మణుని వెంట వెళ్లని ఊర్మిళ కూడా అంతే పతివ్రత అని మనం తెలుసుకోవాలి’ అని చెప్పారు. ఊర్మిళ అయోధ్యలో వ్రతాలు, నోములు చేసేదని మనం భావించవచ్చని అన్నారు. సీతమ్మను అపహరించుకు వచ్చిన రాక్షస రాజు రావణుడు జనస్థానానికి తన సైన్యాన్ని పంపాడని, అక్కడే నివసిస్తూ రామలక్ష్మణుల కదలికలపై సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించాడని చెప్పారు. ధర్మంతో వైరం పెట్టుకుంటే రామునితో వైరం పెట్టుకున్నట్టు అర్థమని అన్నారు. లక్ష్మణ స్వామిని సీతాదేవి పరుషంగా నిందిస్తేనే కానీ ఆయన కదలడని, ఆయన కదిలితేనే కానీ కథ కదలదని ఇదంతా దేవతల ప్రణాళిక అని సామవేదం వివరించారు.
రేపు తాటిపాకలో జాబ్ మేళా
అమలాపురం రూరల్: ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఈ నెల 5న ఉదయం 10.30 గంటల నుంచి రాజోలు మండలం తాటిపాక బాలాజీ ప్రైవేట్ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి తెలిపారు. మరిన్ని వివరాలకు 81218 38392, 79972 53713 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment