భక్తులతో పోటెత్తిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. కార్తిక బహుళ సప్తమి కావడంతో భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా 3,700 వ్రతాలు జరిగాయని, నిత్య కల్యాణంలో రూ.1,116 టిక్కెట్లతో 20 మంది భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పది వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ క్యూలైన్లు, వ్రతమండపాలు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. కాగా శుక్రవారం నుంచి వచ్చే సోమవారం వరకు నాలుగు రోజులూ సుమారు 30 వేల వ్రతాలు, రోజుకు 50 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శనివారం సత్యదీక్షల విరమణ
శనివారం సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా సత్యదీక్ష విరమణ జరుగనుంది. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులతో పాటు వీరి రాకతో రద్దీ ఏర్పడనుంది. ఆదివారం, కార్తికం నాలుగో సోమవారం, దశమి తిథి రావడంతో ఆ రోజు తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. లక్ష మంది స్వామి దర్శనానికి వస్తారని, మంగళవారం ఏకాదశి నాడు సుమారు 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
వ్రతాలు 3,700,
ఆదాయం రూ.40 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment