అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలో వివాహిత కురుపూడి లలితేశ్వరి(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, బంధువుల వివరాల మేరకు, స్థానికంగా ఓ సంచుల గోడౌన్లో లలితేశ్వరి గుమస్తాగా పనిచేస్తోంది. బుధవారం తెల్లవారుజామున వాకింగ్ కోసం వీధిలోకి వెళ్లింది. తెల్లవారినా ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో మృతురాలి భర్త రాజు ఆమెకు ఫోన్ చేశాడు. సెల్ఫోన్ స్విచాఫ్ రావడంతో బంధువులకు విషయం చెప్పాడు. బంధువులంతా గాలించగా.. ఆమె పనిచేస్తున్న సంచుల గోడౌన్లో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ సుధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ ఆధారాలు సేకరించింది. మృతురాలి ముఖంపై గాయాలు, సంఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment