ఆర్మూర్‌టౌన్: రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోట్రాలీని బైక్ ఢీకొట్టిన ఘటనలో మంథని గ్రామానికి చెందిన యువకుడు వేంపల్లి శ్రావణ్‌గౌడ్(27) మృతి చెందగా, అతడి స్నేహితుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్‌గౌడ్ నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.
తన స్నేహితుడు అన్వేష్‌గౌడ్‌తో కలిసి బైక్‌పై పిప్రిలోని బంధువు ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా ఆర్మూర్ మండలం పిప్రి శివారులో ఆటోట్రాలీని ఢీకొట్టారు. గాయాలపాలైన యువకులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమి త్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, శ్రావణ్ అప్పటికే మృతి చెందాడు. అన్వేష్ ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రావణ్‌గౌడ్ ఈనెల 12వ తేదీన తిరిగి అమెరికా వెళ్లాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది. శ్రావణ్ మృతితో గ్రా మంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment