సీపీఎస్‌ను రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలి
బాన్సువాడ: సీపీఎస్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని తపస్ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడలో మల్క కొమరయ్య ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, జీపీఎస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలని, నెలనెలా ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. జీవో–317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు పంపించాలన్నారు. వచ్చే నెల 8న ఇందిరాపార్కు వద్ద తపస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవతా సురేష్ తెలిపారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాఘవరెడ్డి, భూనేకర్ సంతోష్, రాష్ట్ర బాధ్యులు రవీంద్రనాథ్‌ఆర్య, రమేష్, లక్ష్మణచారి, భాస్కర్, శివకాంత్, తదితరులున్నారు.
తపస్ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ
అభ్యర్థి మల్క కొమరయ్య
Comments
Please login to add a commentAdd a comment