పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే డజన్ మందికిపైగా తెరపైకి వచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కరపత్రాలతో ప్రచారం ముమ్మరం చేశారు. బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్లు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వి.నరేందర్‌రెడ్డి, ఎం.రమణారెడ్డి, ఎం.గంగాధర్ తదితరులు బరిలో నిలవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీ ల మద్దతు లేకుండా ఎన్నికల బరిలో దిగుతున్న పలువురు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో వివిధ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారం కూడా చేపట్టాయి. తపస్ తమ అభ్యర్థి గా మల్క కొమరయ్యను ఇప్పటికే ప్రకటించింది. పీఆర్టీయూనుంచి వంగ మహేందర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ సంయుక్తంగా తమ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్‌ను అభ్యర్థి గా ప్రకటించాయి. ఇతర సంఘాలూ ఎన్నికల బరిలో నిలిచేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయం వేడెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment