ఏసీబీకి పట్టుబడిన లింగంపేట ఎస్సై
ఖలీల్‌వాడి: ఫైనాన్స్‌పై తీసుకున్న కారు పంచా యితీలో తలదూర్చిన కామారెడ్డి జిల్లా లింగంపే ట్ ఎస్సై కండి సుధాకర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపేట్‌కు చెందిన కమ్మరి కొండేశ్ స్విఫ్ట్ కారును ఫైనాన్స్‌లో కొనుగోలు చేసి కొన్ని రోజుల తరువాత స్థానికుడైన నవీన్‌గౌడ్‌కు అమ్మేశాడు. ఆ తరువాత నవీన్‌గౌడ్ కారును నిజామాబాద్‌లోని బోర్గాం(పి) లో ఉన్న సెకండ్ కార్ బజార్లో 2022లో విక్రయించాడు. దానిని కొనుగోలు చేసిన సెకండ్ కార్ బజా ర్ యజమాని తులసీ వెంకటస్వామి అలియాస్ స్వామి నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన చిరంజీవికి అమ్మేశాడు. అయితే చిరంజీవికి కారు అమ్మే సమయంలో ఫైనాన్స్ సంస్థకు నెలవారీ వా యిదాలు చెల్లించాలని అంగీకారం కుదుర్చుకున్నా రు. కారు ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది కమ్మరి కొండేశ్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. ఆయన నవీన్‌గౌడ్ ద్వారా నిజామాబాద్‌కు వచ్చి కార్ బజార్ ఓనర్ తులసీ వెంకటస్వామి అలియాస్ స్వామిని కలిసి చిరంజీవిని పిలిపించి మాట్లాడించారు. అయినప్పటికీ చిరంజీవి వాయి దాలు చెల్లించకపోవడంతో కొండేశ్పై ఫైనాన్స్ సిబ్బంది ఒత్తిడి పెంచడంతో ఆయన లింగంపేట్ ఎస్సై కండి సుధాకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సెకండ్ కార్ బజార్ యజమాని స్వామిని లింగంపేట్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై.. కారుతోపాటు చిరంజీవిని తీసుకురావాలని చెప్పాడు. కారు చందూర్ మండల కేంద్రంలో ఉన్నట్లు గుర్తించి ఈనెల 20న లింగంపేట్ పీఎస్‌కు వెంకటస్వామి తీసుకెళ్లాడు. అదే రోజు స్వా మిని ఎస్సై మధ్యాహ్నం 3 నుంచి 7.30 గంటల వరకు లాకప్‌లో ఉంచి, అతడి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛా ఫ్ చేశాడు. కేసు సెటిల్ చేసుకోవాలని, రూ.20 వేలు చెల్లించాలని, సీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్సై బేరం మొదలుపెట్టాడు. చివరికి రూ.12,500 ఇచ్చేందుకు స్వామి ఒప్పుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం లింగంపేట్ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ఎస్సై సుధాకర్ స్వామికి ఫోన్ చేశాడు. వినాయక్‌నగర్‌లోని రుక్మిణి చాంబర్ వద్ద కారులో ఎస్సై సుధాకర్‌కు స్వామి నగదు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్, సీఐలు శ్రీనివాస్, వేణుగోపాల్, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై ని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్న ట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ చెప్పారు. ఏసీబీకి పట్టుబడిన ఎస్సై సుధాకర్ స్వగ్రామం నవీపేట్ మండలం నాగేపూర్ అని పోలీసుల ద్వారా తెలిసింది.
ఫైనాన్స్ పంచాయితీలో
లంచం తీసుకుంటూ..
కేసు చేస్తానని బెదిరింపులు..
డబ్బులు డిమాండ్
లాకప్‌లో పెట్టాడనే పట్టించా..
ఎస్సై సుధాకర్ నన్ను లాకప్ లో పెట్టి ఇబ్బంది పెట్టా డు. కారును తీసుకువెళ్లినా కేసు నమోదు చేస్తానని బెదిరించా డు. కారు ఫైనాన్స్ విషయంలో నా ప్రమేయం లేదని చె ప్పినా లాకప్‌లో మూడున్నర గంటలపాటు ఉంచా డు. అందుకే ఏసీబీని ఆశ్రయించాను. కేసు కాకుండా డబ్బులు డిమాండ్ చేయడంతో పట్టించాను.
– తులసీవెంకటస్వామి, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment