‘ఉపాధి హామీ’లో కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి టౌన్: ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ఆస్తి పన్ను, తాగునీరు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం సిబ్బందికి సూచించారు. నర్సరీల్లో నాటిన విత్తనాలు మొలకెత్తేందుకు రోజూ నీరు పట్టాలన్నారు. నిరుపేదలకు మంజూరు చేసిన మరుగుదొడ్లను నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాన్ని వచ్చేనెల 15లోగా చేరుకోవాలని సూచించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందరి కృషితో ధాన్యం సేకరణలో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచామని, ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈవో చందర్, సీపీవో రాజారాం, డీఆర్డీవో సురేందర్, ఆర్డీవోలు రంగనాథ్‌రావు, ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment