సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం మొదటిసారిగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 100 శాతం అస్తి పన్నులు వసూలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులో సానిటేషన్ సమస్యలు లేకుండా, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సానిటేషన్ అధికారులకు సూచించారు. పట్టణంలో నీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వేసవికాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ స్పందన, ఇంజినీరింగ్, సానిటరీ, రెవెన్యూ, వాటర్‌వర్క్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
బల్దియా ప్రత్యేకాధికారి,
అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment