సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇందిరమ్మ ఆత్మీయ భ రోసా పథకానికి సంబంధించిన నిధులు మంగళవా రం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. భూమి లేని రైతు కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద లబ్ధిదారుకు ఏటా రూ. 12 వేలు అందించనున్నారు. తొలి విడతలో మంగళవారం రూ. 6 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. 22 గ్రామాలకు చెందిన 273 మంది ఖాతాలలో రూ. 16.38 లక్షలు జమ అయ్యాయని అధికారులు తెలిపారు.
జిల్లాలో 535 గ్రామాలు ఉండగా.. పైలట్ ప్రా జెక్టుగా ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపి క చేసి నాలుగు పథకాలను రిపబ్లిక్ డే రోజున ప్రా రంభించారు. సోమవారం జిల్లాలో ఎంపిక చేసిన 22 గ్రామాల రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. మంగళవారం ఇందిరమ్మ భరోసా నిధులు జమ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆదివారమే అందించారు. రేషన్ కార్డులకు సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చారు. వచ్చే నెల నుంచి వారికి రేషన్ బియ్యం అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment