రామారెడ్డి : కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు జన్మిస్తాయని జిల్లా పశుగణాభివృద్ధి అధికారి మజీద్ పేర్కొన్నారు. మంగళవారం మోషంపూర్లో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులలో ఎద లక్షణాలు గమనించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించాలని సూచించారు. శిబిరంలో పశువులకు రామారెడ్డి మండల పశు వైద్యాధికారి రామచందర్ చూడి పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో 40 సాధారణ చికిత్సలు, 51 గర్భకోశ వ్యాధుల చికిత్సలు, ఒక కృత్రిమ గర్భధారణ, 22 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో వీఎల్వో శ్రీనివాసరావు, పాడిరైతులు రాజిరెడ్డి, రాములు, అనిల్ రెడ్డి, రాజు, భూమయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment