కొత్త మండలాల్లో మండల పరిషత్‌లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని పాల్వంచ, మహ్మద్‌నగర్, డోంగ్లీ మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇన్చార్జీ ఎంపీడీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మాచారెడ్డి మండలంనుంచి పాల్వంచ, నిజాంసాగర్ మండలంనుంచి మహ్మద్‌నగర్, మద్నూర్ మండలంనుంచి డోంగ్లీ మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సీఈవో ఆయా మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసి, అఽధికారులను నియమించారు. పాల్వంచ మండల మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రాథమిక సహకార సంఘ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మహ్మద్‌నగర్ మండలానికి సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ భవనం పైఅంతస్తులో మండల పరిషత్ ఏర్పాటు చేస్తారు. డోంగ్లీ మండల పరిషత్ కార్యాలయాన్ని స్థానిక ప్రాథమిక సహకార సంఘం భవనంలో ఏర్పాటు చేయనున్నారు. పాల్వంచ ఎంపీడీవోగా ప్రస్తుతం మాచారెడ్డి మండల పరిషత్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను నియమించారు. మహ్మద్‌నగర్ ఎంపీడీవోగా నిజాంసాగర్ ఎంపీవో అనితారెడ్డిని, డోంగ్లీ ఎంపీడీవోగా మద్నూర్ ఎంపీవో వెంకటనారాయణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా మండలాలకు కావలసిన ఫర్నిచర్‌ను ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మండల పరిషత్ కార్యాలయం నుంచే సర్దుబాటు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇన్చార్జీ ఎంపీడీవోల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
Comments
Please login to add a commentAdd a comment