వేములవాడఅర్బన్: సైబర్ మోసగాని చేతిలో ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు మోసపోయిన ఘటన సోమవారం జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వేములవాడ మండలం అగ్రహారంలో ఆన్‌లైన్ సెంటర్ నిర్వహిస్తున్న మహేశ్‌కు సోమవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను డాక్టర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తనకు ఆన్‌లైన్ ద్వారా (ఫోన్ పే లేదా గూగుల్ పే) డబ్బు పంపిస్తే కమీషన్ ఇస్తానని, తన మనిషి వచ్చి డబ్బులు ఇస్తాడని ఎర వేశాడు. ఇదే సైబర్ మోసగాడు వేములవాడ నందికమాన్ వద్ద ఉన్న ఓ బిర్యాని సెంటర్ నిర్వాహకుడు సురేశ్‌కు ఫోన్ చేసి తాను డిగ్రీ కళాశాల లెక్చరర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తనకు 110 బిర్యాణిలు కావాలని తెలుపగా, సురేశ్ అడ్వా న్స్ డబ్బులు కావాలని అడిగాడు. అగ్రహారంలోని ఆన్‌లైన్ సెంటర్ వద్దకు వెళ్లి ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారని తెలిపాడు. సురేశ్ అక్కడికి వెళ్లి రాజిరెడ్డికి కాల్ చేసి ఆన్‌లైన్ సెంటర్ మహేశ్‌కు ఇచ్చా డు. రాజిరెడ్డి ఫోన్‌లో మహేశ్‌తో మాట్లాడుతూ తన కు రూ.65 వేలు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని, సు రేశ్ డబ్బులు తీసుకువచ్చాడని నమ్మించాడు. దీంతో మహేశ్ రెండు నంబర్లకు ఫోన్ పే ద్వారా రూ. 65 వేలు పంపించాడు. అనంతరం సురేశ్‌ను మహే శ్ డబ్బులు అడిగాడు. కాగా తనకు బిర్యాని డబ్బులు రూ.5 వేలు అడ్వాన్స్ ఆన్‌లైన్ సెంటర్‌లో మహే శ్ ఇస్తాడని చెబితే ఇక్కడికి వచ్చానని సురేశ్ పేర్కొన్నాడు. వెంటనే బాధితులిద్దరూ సైబర్ మోసగాడు రాజిరెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment