ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయలేదని..
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో బార్ అండ్ రెస్టారెంట్‌ను మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. సుమారు గంటన్నర సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం పూట గిరాకీతో కళకలాడుతున్న సిరిసిల్ల బైపాస్‌రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్యతో పాటుగా అధికారులు వచ్చారు. అక్కడి వర్కర్లతో బార్ సీజ్ చేస్తున్నామని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. వెంటనే బార్ యజమాని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుమారుడు జిందం మహేందర్, భర్త జిందం చక్రపాణికి సమాచారం ఇచ్చారు. మహేందర్ వచ్చాక ట్రేడ్ లైసెన్సు ఫీజు కట్టనందుకు సీజ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. జిందం చక్రపాణి వచ్చి ట్రేడ్ లైసెన్సు కట్టకుంటే బార్‌ను సీజ్ చేసే అధికారం మీకు లేదని మండిపడ్డారు. ఫీజు రుసుం చెల్లిస్తామని, వెంటనే వేసిన సీల్ తొలగించాలని డిమాండ్ చేశారు. చక్రపాణి డబ్బులు చెల్లించే ప్రయత్నం చేయగా కార్యాలయానికి వచ్చి ఆన్లైన్లో చెల్లించాలని కమిషనర్ లావణ్య సూచించి వెళ్తుండగా.. బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది ఆమె వాహనం ఎదుట బైఠాయించారు. టౌన్ సీఐ కృష్ణ అక్కడికి చేరుకుని బార్ యజమాన్యంతో మాట్లాడి సర్దిచెప్పారు. బార్ యాజమాన్యం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ట్రేడ్ లైసెన్సు ఫీజు రూ.41,950 పెనాల్టీతో పాటుగా చెల్లించారు. లైసెన్స్ ఫీజు కట్టాలని ముందస్తు నోటీసులు జారీ చేయాలి కానీ, సీజ్ చేయడం సరికాదని జిందం చక్రపాణి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం.. అధికారుల రాజకీయ కక్ష ధోరణిపై కోర్టుకు ఈడుస్తానని మండిపడ్డారు. ఎకై ్సజ్ సీఐ ముస్తాఫా వచ్చి రెస్టారెంట్‌ను సీజ్ చేసే అధికారం బల్దియాకు ఉంటుందని, బార్‌ను సీజ్ చేసే అధికారం ఉండదని మున్సిపల్ కమిషనర్ ముందే మీడియాకు వివరించారు.
సిరిసిల్లలో బార్ అండ్ రెస్టారెంట్ సీజ్
మున్సిపల్ కమిషనర్‌తో యజమాని చక్రపాణి వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment