నాడు కేసీఆర్.. నేడు రేవంత్...
కరీంనగర్ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పులనివ్వడంలో పరిపాటి. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్‌ఎస్‌కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్‌లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి బీఆర్‌ఎస్‌కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల నరేందర్‌రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment