● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివన్నారు. మున్సిపల్ డ్రైవర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లకు చెల్లిస్తు న్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయమో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment