పొద్దంతా ఎండ.. రాత్రంతా చలి
కరీంనగర్‌రూరల్: వేసవికాలం ప్రారంభమైనప్పటికి కరీంనగర్ జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజుల నుంచి పొద్దంతా విపరీతమైన ఎండ కాస్తుండగా రాత్రి చలి వణికిస్తోంది. మొన్నటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ప్రస్తుతం రాత్రుల్లో మళ్లీ చలితో గజగజలాడుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు సూరీడు భగభగ మండుతుండగా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రుల్లో శీతాకాలాన్ని తలపిస్తోంది. శనివారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్టం 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్టం, గరిష్ట ఉష్ణోగ్రతల నడుమ 20డిగ్రీల వరకు ఉండటంతో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఆస్వస్థతకు గురవుతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పొద్దంతా ఎండ.. రాత్రంతా చలి
Comments
Please login to add a commentAdd a comment