అప్పులబాధతో ఒకరు.. అనారోగ్యంతో మరొకరు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఇందిరమ్మకాలనికి చెందిన నేత కార్మికుడు పరికిపెల్లి రాజు (55)కు భార్య పద్మ, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించగా రూ.5 లక్షలమేర అప్పు అయ్యింది. కొద్దిరోజులుగా పవర్లూమ్స్ పని దొరక్కపోవడంతో మనస్తాపానికిగురై మద్యానికి బానిసయ్యాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో గొడవపడిన రాజు మనస్తాపంతో బాత్రూమ్‌లు కడిగేందుకు ఉపయోగించే యాసిడ్ తాగాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. మండలంలోని చీర్లవంచ గ్రామానికి చెందిన మొగిలోజి విష్ణు (45) వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.. రెండేళ్లక్రితం పక్షవాతం రావడంతో పనిచేయలేని పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు. అతడికి భార్య కవిత, కొడుకు, పుట్టుకతో అంధురాలైన కూతురు ఉన్నారు. మంగళవారం కవిత ఉపాధిహామీ పనికి వెళ్లగా ఇంటిలోని బాత్‌రూమ్‌లో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తంగళ్లపల్లి మండలంలో ఇద్దరి బలవన్మరణం
అప్పులబాధతో ఒకరు.. అనారోగ్యంతో మరొకరు
Comments
Please login to add a commentAdd a comment