సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
శివాజీనగర: ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐ విచారణకు ఇచ్చిన తీర్మానాన్ని కాంగ్రెస్ మంత్రివర్గం ఉపసంహరించుకోవడంపై శుక్రవారం ఇరు సభల్లో మాటల యుద్ధానికి దారితీసింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆర్.అశోక్ స్టాండింగ్ నోటీసు కింద తన ప్రతిపాదనను సమర్పించేందుకు అనుమతించాలని స్పీకర్ యూటీ ఖాదర్‌ను అభ్యర్థించారు. డీకే శివకుమార్‌పై ఉన్న సీబీఐ దర్యాప్తును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం రాజ్యాంగ విరుద్దమని, ఇది రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని, తక్షణమే ఈ తీర్మానాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు మాటల యుద్ధానికి దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ యూటీ ఖాదర్ మాట్లాడుతూ... ఈ కేసు కోర్టులో ఉందని, దీంతో చర్చకు అవకాశం లేదని చెబుతూ గందరగోళానికి తెరదించారు.
విధాన పరిషత్‌లో అదే గొడవ:
విధాన పరిషత్‌లో కూడా ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌పై సీబీఐ కేసు విచారణను ఉపసంహరించుకోవడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు గొడవకు దిగాయి. విధాన పరిషత్ కార్యకలాపాల్లో శుక్రవారం ఆరంభంలో నియమం 59 కింద బీజేపీ సభ్యుడు కోటా శ్రీనివాసపూజారి ఈ విషయాన్ని ప్రస్తావించి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న డీ.కే.శివకుమార్ సీబీఐ కేసు ఉప సంహరించుకోవటం ప్రజాస్వామ్యానికి తీరని అవమానం చేశారని, ఒత్తిళ్లకు తలొగ్గి చట్టంపై పరిజ్ఞానం లేకుండా నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సమయంలో రంగ ప్రవేశం చేసిన ప్రభుత్వ చీఫ్‌విప్ సలీం అహమ్మద్... ఇప్పటికే సభాపతి ముసాయిదా అంగీకార ప్రక్రియను ప్రకటించారు. నియమం 59 కింద చర్చకు అవకాశం ఇవ్వటానికి సాధ్యపడదని తెలిపారు.
ఈ సమయంలో ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యుల మధ్య ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సభాపతి బసవరాజ హొరట్టి జోక్యం చేసుకుని అభిప్రాయం తెలపాలని న్యాయశాఖ మంత్రి హెచ్.కే.పాటిల్‌కు సూచించారు. ఆ తరువాత హెచ్.కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ దీనిని వాయిదా తీర్మానానికి తీసుకొన్నదే తప్పు. ఈ విషయం కోర్టులో ఉంది, దానిని చర్చకు తీసుకొస్తే ఎలాగని ప్రశ్నించారు. ఇది న్యాయ ఉల్లంఘన అవుతుందని రూలింగ్ ఇచ్చారు. అయినా కూడా దీనిని ఆమోదించకుండా చర్చకు అవకాశం కల్పించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభాపతి రూలింగ్ ఇచ్చిన తరువాత మాట్లాడటం గౌరవం కాదని కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి ధ్వజమెత్తారు. సభాపతి హొరట్టి, ఈ విషయంపై జోకులు వేయొద్దని సభ్యులకు చురకలంటించారు.
డీసీఎంపై సీబీఐ కేసు నేపథ్యం..
ఉభయ సభల్లో గందరగోళం
అధికార పార్టీపై ప్రతిపక్షాల ధ్వజం
శీతాకాల సమావేశాలకు తెర
66 గంటలకు పైగా కార్యకలాపాలు
17 బిల్లులకు ఆమోదం
బనశంకరి: బెళగావి సువర్ణసౌధలో ఈనెల 4నుంచి జరుగుతున్న శీతాకాల సమావేశాలకు శుక్రవారం తెరపడింది సభాకార్యకలాపాలను నిరవదికంగా వాయిదా వేస్తూ శాసనసభ స్పీకర్ యుటీ.ఖాదర్ ఆదేశాలు జారీ చేశారు. సుమారు 66 గంటలకు పైగా కార్యకలాపాలు జరిగాయి 2023–24 రాష్ట్ర ఆర్థిక మధ్య వార్షిక పరిశీలనా నివేదిక దనవినియోగ బిల్లుతో పాటు మొత్తం 17 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాయని స్పీకర్ యుటీ.ఖాదర్ తెలిపారు. శాసనమండలిలో కులాలు, ఉపకులాల సంక్షేమసమితి 2023–24 మొదటి మధ్యంతర నివేదిక, ప్రజా ఉద్యమాల 136 నివేదిక, కర్ణాటక విధానసభ సభ్యులు ప్రైవేటు విధేయక, నిర్ణయాల సమితి , 2023–24 మొదటి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఉత్తరకర్ణాటక అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చ జరగగా 42 మంది ఎమ్మెల్యేలు, 11 గంటల 04 నిమిషాలు మాట్లాడారని తెలిపారు.రాష్ట్రంలో తలెత్తిన కరువు పరిస్థితులపై చర్చించారు. యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై చట్టాలు రూపొందించారు. యువ ఎమ్మెల్యేలు వాతావరణ మార్పులు, తీవ్రతపై సభలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment