సీఎం మార్పు ఉండదు: హోం మంత్రి | - | Sakshi
Sakshi News home page

సీఎం మార్పు ఉండదు: హోం మంత్రి

Published Thu, Oct 10 2024 1:46 AM | Last Updated on Thu, Oct 10 2024 1:46 AM

-

మైసూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను మార్చే ప్రసక్తే లేదని, ఆయనే సీఎంగా కొనసాగుతారని హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ చెప్పారు. బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం మార్పు లేదు. సిద్దరామయ్య రాజీనామా చేసే అవసరం లేదు. ఐదేళ్ల పాటు సిద్దరామయ్యే కొనసాగుతారన్నారు. మంత్రి హెచ్‌సీ మహదేవప్ప నివాసంలో విందు భేటీకి మంత్రి సతీష్‌ జార్కిహొళి, మహదేవప్ప, ఏఆర్‌ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యామన్నారు. తాము తరచు ఇలా కలుస్తామని, అందులో రాజకీయాలు, దళిత సీఎం తదితరాల గురించి రాజకీయ చర్చ చేయలేదన్నారు. సీఎం మార్పు అని విపక్షాలు చేస్తున్నదంతా వృథా ప్రయాసేనని, వారికి వేరే పని లేదని ఎద్దేవా చేశారు. ముడా కుంభకోణం గురించి మైసూరు వాసులకే తెలియదు, ఇంక హరియానా వారికి తెలుసా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కోళివాడ మాటలు ఆయన వ్యక్తిగతమన్నారు. కులగణన నివేదిక విడుదలపై ఈ నెల 18న కేబినెట్‌ సమావేశంలో తీర్మానం జరుగుతుందని చెప్పారు.

నేవీ స్థావరంపై డ్రోన్‌ సంచారం

దొడ్డబళ్లాపురం: కారవార సమీపంలోని అరగాద వక్కనహళ్లి వద్ద ఉన్న కదంబ నౌకాదళ స్థావరంపై మంగళవారం రాత్రి అనుమానాస్పద డ్రోన్‌ ఎగరడం అనుమానాలకు తావిస్తోంది. స్థావరం మీదుగా బిణగా హైవే సొరంగమార్గం వరకూ డ్రోన్‌ ఎగిరింది. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్‌లో వీడియో తీశారు. సుమారు 3 కిలోమీటర్ల ఎత్తున ఎగిరింది, నైట్‌ విజన్‌ కెమెరా కూడా ఉన్నట్లు గుర్తించారు. సాధారణ డ్రోన్‌లు 60 నుండి 1,200 అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయి. అయితే ఈ డ్రోన్‌ చాలా ఆధునికమైనది కావడంతో శత్రుదేశాల పని అని అనుమానాలు కలుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement