వచ్చే ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సదస్సు | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సదస్సు

Published Thu, Nov 21 2024 12:58 AM | Last Updated on Thu, Nov 21 2024 12:58 AM

-

బనశంకరి: పెట్టుబడుల ఆకర్షణ కోసం 2025 ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును నగరంలో నిర్వహిస్తామని భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్‌ తెలిపారు. బుధవారం విధానసౌధలో ఈ సదస్సు గురించి ఉన్నతాధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. సదస్సులో దేశ విదేశాలకు చెందిన 5 వేలమంది ప్రతినిధులు, టెక్‌ నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే అమెరికా, జపాన్‌లో రోడ్‌షోలను నిర్వహించినట్లు తెలిపారు.

మంత్రికి విద్యార్థి షాక్‌

బనశంకరి: ప్రాథమిక విద్యా మంత్రి మధు బంగారప్పకు భంగపాటు ఎదురైంది. బుధవారం విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుండగా విద్యాశాఖ మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్థి చెప్పాడు. ఈ మాటలు విన్న మంత్రి కంగుతిన్నాడు. ఏయ్‌, ఎవరు అలా మాట్లాడింది. నేనేమన్నా ఉర్దూలో మాట్లాడానా, కన్నడలోనే కదా మాట్లాడింది అని గరం అయ్యారు. అక్కడే ఉన్న పీయూ కాలేజీ డైరెక్టర్‌ సింధూ బీ.రూపేశ్‌ తదితరులు... ఆ విద్యార్థి ఎవరో గుర్తించి చర్యలు తీసుకోండి అని సూచించారు. ఆ విద్యార్థి వారి వివరాలు తెలుసుకుని కఠిన చర్యలు తీసుకోండి అని మంత్రి మళ్లీ ఆగ్రహించారు. వందలాదిమందిలో ఎవరు అలా అన్నారో ఇంకా తెలియలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement