మైసూరు: టాటా ఏస్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, 13 మంది గాయపడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకా సిద్దయ్యనపుర గ్రామంలో జరిగింది. బాణూరు గ్రామ నివాసులు రాజమ్మ (53), శృతి (30) మృతులు. బైక్ చోదకుడు ప్రకాష్, బస్సు డ్రైవర్ రాజశేఖర్, టాటా ఏస్‌లో ఉన్న బాణూరు గ్రామానికి చెందిన వారితో కలిపి 13 మంది గాయపడ్డారు. వారికి కొళ్లెగాల ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సిమ్స్, మైసూరు ఆస్పత్రులకు తరలించారు.
కొళ్లెగాలలో తిథి కార్యాన్ని ముగించుకుని బాణూరుకు టాటా ఏస్ వాహనంలో కొందరు తిరిగి వెళుతుండగా ఓవర్ టేక్ చేసే సమయంలో టాటా ఏస్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో స్థలంలోనే ఇద్దరు మరణించారు. టాటా ఏస్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఓ బైకిస్టు కూడా గాయపడ్డాడు.