
ధరల పెంపు పంచ గ్యారెంటీలకు వడ్డీనా?
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయంతో గ్యారెంటీలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారి నుంచి వడ్డీని వసూలు చేస్తోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా విద్యుత్ బిల్లును యూనిట్‌కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు పెంచడం తగదని పేర్కొంటూ ఈ నెల 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పాల రైతులకు రూ.662 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందని ధ్వజమెత్తారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. మాజీ శాసన సభ్యులు బసన గౌడ, పాపారెడ్డి, శంకరప్ప, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, రవీంద్ర జాలదార్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు.
కాంగ్రెస్‌కు ఏటీఎంగా కర్ణాటక సర్కార్ 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం
జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ