రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన | Sakshi
Sakshi News home page

రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన

Published Sun, May 5 2024 12:15 AM

రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం వైభవంగా సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement