పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన నేలకొండపల్లి బౌద్ధస్తూపం, పాలేరు రిజర్వాయర్, ఖమ్మం ఖిల్లా, పులిగుండాల ప్రాజెక్ట్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద 40 ఫీట్ల రోడ్డు అభివృద్ధి చేయడం ద్వారా వాహనాల రాకపోకలు సులువవుతాయని చెప్పారు. అలాగే, పులిగుండాలలో క్యాంప్ సైట్ ఏర్పాటుచేయాలని సూచించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఎకో టూరిజంకు బ్రాండింగ్ వచ్చేలా ప్రత్యేక లోగో, ట్యాగ్ లైన్ తయారు చేయించాలని చెప్పారు. అనంతరం జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్ వే నిర్మా ణం, పార్కింగ్ ఏరియా గుర్తింపుపై సూచనలు చేశారు. అలాగే, జాఫర్ బావి వద్ద మార్చిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు.
12లోగా నీటి వనరుల ఆక్రమణలపై నివేదిక
జిల్లాలోని నీటి వనరుల ఆక్రమణలను గుర్తించి ఫిబ్రవరి 12లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ విభాగాల వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా పరిశీలిస్తే వనరుల ఆక్రమణలను గుర్తించవచ్చన్నారు. కాగా, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్‌ను ప్రతీ 45 మీటర్లకు ఒక భాగంగా విభజించుకుని పనులు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ భూమిపోగా ప్రైవేట్ భూమి సేరకణలో వేగం పెంచాలని చెప్పారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, జల వనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం బ్రాండ్‌తో లోగో, ట్యాగ్ లైన్
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
Comments
Please login to add a commentAdd a comment