విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

Published Fri, Jan 31 2025 12:16 AM | Last Updated on Fri, Jan 31 2025 12:16 AM

విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

● సైబర్‌ మోసాలపై విస్తృత అవగాహన ● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: నేరాలను నియంత్రించేలా విజబుల్‌ పోలీసింగ్‌కు తోడు నిఘా మరింత పటిష్ట పరచాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో పోలీస్‌స్టేషన్ల వారీగా కేసుల నమోదు, దర్యాప్తు, పరిష్కారం, సొత్తు రికవరీపై ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరగాలంటే కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఘటనాస్థలిలో సాక్ష్యాధారాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో త్వరగా చార్జిషీట్లు దాఖలు చేయాలని, అలవాటుగా నేరాలు చేసే వారిపై హిస్టరీ షీట్లు తెరిచి సరిహద్దు జిల్లాల అధికారులతో సమాచారాన్ని పంచుకుంటే కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే, చోరీల నియంత్రణ, సొత్తు రికవరీపై పోలీస్‌ అధికారులు పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తూ రాత్రి వేళ గస్తీ పెంచాలని తెలిపారు. అంతేకాక బస్టాండ్లు, స్టేషన్ల వంటి రద్దీ ప్రదేశాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయాలని సూచించారు.

ప్రతీ గ్రామంలో అవగాహన

అధికారులు తమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో సైబర్‌ నేరాల తీవ్రత, సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూనే మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి అవసరమైన చోట బారికేడ్లు, కోన్లు ఏర్పాటు చేయాలని, ప్రతీరోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు, వాహనాల తనిఖీ చేపట్టాలని సూచించారు. అలాగే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ఆర్జీలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. అడిషనల్‌ డీసీపీలు నరేష్‌కుమార్‌, ప్రసాద్‌రావు, ట్రెయినీ ఐపీఎస్‌ రుత్విక్‌సాయి. ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్‌, రవి, శ్రీనివాసులు, సర్వర్‌, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement