రామదాసు మందిరం ఆవరణే ఇది... | - | Sakshi
Sakshi News home page

రామదాసు మందిరం ఆవరణే ఇది...

Published Fri, Jan 31 2025 12:16 AM | Last Updated on Fri, Jan 31 2025 12:16 AM

రామదాసు మందిరం ఆవరణే ఇది...

రామదాసు మందిరం ఆవరణే ఇది...

నేలకొండపల్లి: పరమ భక్తాగ్రేసరుడైన కంచర్ల గోపన్న(రామదాసు) స్వస్థలం నేలకొండపల్లిలో ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి వేదిక లేదని ఇటీవల రూ.లక్షలు వెచ్చించి రామదాసు ధ్యాన మందిరం ఆవరణలోనే ఆడిటోరియం నిర్వహించారు. ఇందులో శనివారం నుంచి మూడు రోజుల పాటు భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, శ్రీ భక్తరామదాసు విద్వత్‌ కళాపీఠం, అధికార యంత్రంగం ఆధ్వర్యాన రామదాసు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. కానీ ఇప్పటివరకు అటు ధ్యాన మందిరంలో, ఇటు ఆడిటోరియంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి తోడు ఆడిటోరియంపై పర్యవేక్షణ లేక గొర్రెలు, మేకలను పెంపకందారులు మేపుతున్నారు. ఇక్కడి మందిరాన్ని భద్రాచలం దేవస్థానం దత్తత తీసుకున్నా ఏర్పాట్లపై పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement