● చర్యలకు ఉపక్రమించిన కేఎంసీ కమిషనర్ అభిషేక్ ● నిబంధనలు పాటించని కాంట్రాక్టర్ టెండర్లు రద్దు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కమిషనర్ అభిషేక్ అగస్త్య చర్యలకు ఉపక్రమించారు. కమిషనర్ శుక్రవారం 4వ డివిజన్‌లో తనిఖీలకు వెళ్లిన సమయాన జవాన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ నాగుబాయిని విధుల నుంచి తొలగించాలని, ఆ డివిజన్ ఇన్‌చార్జ్ బాధ్యతలను 4వ డివిజన్ జవాన్‌కు అప్పగించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఇంజనీరింగ్ సెక్షన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పవన్, శ్రీనివాస్, శ్రీకాంత్‌ను రెవెన్యూ విభాగానికి అటాచ్ చేయాలని ఆదేశించారు. వీధి దీపాలు మార్చడంలో నిర్లక్ష్యం వహించిన ఎలక్ట్రికల్ విభాగం ఉద్యోగి కరుణాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక నిబంధనలను పాటించని కాంట్రాక్టర్‌కు సంబంధించి రెండు టెండర్లను రద్దు చేయాలని సూచించారు. అలాగే, రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వాహనాల కాంట్రాక్ట్, కార్యాలయ నిర్వహణ, ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకపోవడంతో సంబంధిత కాంట్రాక్టను రద్దుచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ అంతేకాక ఈ రెండింటిని తర్వాతి స్థానంలో ఉన్న కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ శనివారంలోగా ఉత్తర్వులు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment