ఆదిలాబాద్‌టౌన్: మహారాష్టలోని కిన్వాట్ తాలుకా జవార్ల గ్రామానికి చెందిన మేస్రం వికాస్ (23) ఈ నెల 21న తన ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
ఉట్నూర్‌రూరల్: మండలంలోని శ్యాంనాయక్ తండాకు చెందిన జాదవ్ భిక్కు (34) అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై మనోహర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment