గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ ఏపీవో వసంత్‌రావు
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీవో వసంత్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇంద్రవెల్లి మండలం వాడ్గాం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని, ఉట్నూర్ మండలం చిన్నుగూడ గ్రామానికి చెందిన దుర్గుబాయి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని, ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన విలాస్ తనకు జిరాక్స్ సెంటర్ కోసం లోన్ కల్పించాలని వేడుకున్నారు. ఇంకా పింఛన్, రెండు పడకల గదుల ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీవో సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, పీహెచ్‌వో సందీప్‌కుమార్, డీపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment