పెంచేయడమే!
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఇక తగ్గం..
7
డీజీపీని కలిసిన సీపీ
విజయవాడస్పోర్ట్స్: డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు శుక్ర వారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
యూపీహెచ్‌సీలో తనిఖీలు
లబ్బీపేట: రోగులకు అందుతున్న సేవల పరిశీలనలో భాగంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని శుక్రవారం విజయవాడ రాజీవ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
గుడ్లవల్లేరు/సాక్షి మచిలీపట్నం: భూముల ధరలను పెంచటంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. గత నెలలోనే వీటిని పెంచేందుకు ముందుకు వచ్చిన సర్కారు.. జనం నుంచి విమర్శలు రావటంతో వెనక్కు తగ్గినట్లు తగ్గి ఇప్పుడు మళ్లీ వాటిని తెరమీదకు తెచ్చింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లోనే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్తగా పెంచిన భూముల ధరలను బట్టి రిజిస్ట్రేషన్ చేయాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం నుంచి భూముల ధరలు పెరగనున్నట్లు రెవెన్యూ శాఖ కూడా ప్రకటించింది. దీంతో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. అయితే రైల్వే లైన్లు, రహదారుల అభివృద్ధికి చేయవలసిన భూ సేకరణ అనంతరం ఏప్రిల్ నుంచి భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ధరలను కూడా పెంచాలని ప్రభుత్వానికి వివిధ శాఖల అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సంపద సృష్టించటమంటే జనం మీద ప్రభుత్వ ఖజానాకు సంపాదించటమేనా? అంటూ జిల్లా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాబు బాదుడే బాదుడు..
భూముల మార్కెట్ ధరను అమాంతంగా పెంచేసి చంద్రబాబు కొత్త బాదుడికి తెర తీశారు. అమరావతి భూములను మినహాయించి ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని భూముల ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని 13సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలను అమాంతం పెంచేందుకు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్‌లోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు సన్నద్ధమయ్యారు. కానీ ప్రజా విమర్శలతో అపుడు వెనక్కి తగ్గినట్లుగా తగ్గి.. మళ్లీ ఇప్పుడు భూముల ధరలను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భూముల బుక్ వాల్యూ ఎక్కువగా ఉందనుకునే ప్రాంతాల్లో సైతం 15శాతానికి తక్కువ కాకుండా పెంచాలని ఆయా శాఖల అధికారులకు వచ్చిన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెంచేశారు. అలాగే భూముల విలువ తక్కువగా ఉందనుకునే ఏరియాల్లో 45శాతానికి కూడా పెంచేందుకు వెనుకాడకుండా కసరత్తు చేసి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు.
తగ్గేదేలేదు..
పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని భూములతో సహా విలువను అమాంతంగా 45శాతం వరకు పెంచుతున్నారు. మునిసిపాలిటీలు, నగర
పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాల విలువనూ ప్రభుత్వం పెంచనుంది. పట్టణాల్లోని అపార్టుమెంట్లలోని ప్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువ రూ.900నుంచి రూ.1,400వరకు పెరగనుంది. ప్రాంతాల వారీగా స్థలం విలువలను బట్టే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతుండటంతో ఈ కొత్త భారం ఏమిటని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
న్యూస్‌రీల్
జనం నెత్తిన మరో భారం వేస్తున్న కూటమి సర్కార్
నేటి నుంచి భూముల ధరల పెంపు సర్క్యులర్ విడుదల చేసిన ప్రభుత్వం
గత నెల పెంచుతామని వెనక్కు తగ్గిన వైనం భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
డిసెంబర్‌లోనే చక్కబెట్టారు..
కూటమి ప్రభుత్వం అమలు చేసి కొత్త భారం ప్రజలపై వేసేందుకు గత ఏడాది డిసెంబర్‌లోనే అన్నీ చక్కబెట్టేశారు. డిసెంబర్ 20వ తేదీ లోపు సబ్ రిజిస్ట్రార్లు డేటా ఎంట్రీ చేశారు. వాటిపై 24వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను 26వ తేదీ లోపుగా పరిష్కరించారు. చివరిగా 27వ తేదీలోపు నూతన భూముల విలువలను మార్పు చేసే ప్రక్రియ అనేది ముగించారు. 2025 ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే శనివారం నుంచి పెంచిన భూముల విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది.
అన్ని వర్గాలకు ఇబ్బందే..
రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేసుకుని ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే.. పేద, మధ్య తరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇబ్బందిగా మారనుంది. భూముల విలువను అమ్మేవారి కోసం పెంచారు సరే.. కొనేవారిని ఎందుకు మరిచారు. రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని సామాన్య ప్రజలు తట్టుకోలేరు.
– పామర్తి వీర వెంకట రామ్మోహనరావు, మాజీ సర్పంచి, దేశాయిగుంట, గుడ్లవల్లేరు మండలం
ప్రజా సంక్షేమం ఏది?
ప్రజలపైనే భారం వేసి సంపాదన సృష్టించడం సిగ్గు చేటు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. అందుకు పెరిగిన విద్యుత్ చార్జీలతో పాటు ఇంటి పన్నులే నిదర్శనం. ఇపుడు కొత్తగా భూములతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేసి పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారాన్ని మోపుతోంది.
– నిడుమోలు పెద్దిరాజు,
బైండ్ల కుల కృష్ణాజిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment