
జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్‌పోలో ప్రతిభ
కర్నూలు సిటీ: స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ మైండ్ సెట్ జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్‌పో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్‌ఈసీఆర్‌టీ కొన్ని అంశాలను ఎంపిక చేసి తయారు చేసిన వీడియోలను ప్రతి శుక్రవారం తరగతి గదుల్లో ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు 40 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఆవిష్కరించిన ప్రదర్శనలను జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను బీఈడీ కాలేజీ (ఐఏఎస్‌ఈ)ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి, అధ్యాపకురాలు డి.పార్వతిదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రథమ విజేతగా కోడుమూరు మండలం కల్లపరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎం.శిరీషా, బి.లక్ష్మీ, హర్షవర్ధన్, ద్వితీయ విజేతగా కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్‌కి చెందిన ఎం.మేఘన, ఎస్.సనా ముస్కాన్, ఆర్.అంజలీనా, తృతీయ విజేతగా గోనెగండ్ల మండలం గంజిహళ్లి జెడ్పీ హైస్కూల్‌కి చెందిన విద్యార్థులు పి.సౌమ్య, ఎ.శ్రావణి, ఎస్.రాజేష్ నిలిచారు. కార్యక్రమంలో ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మైండ్‌సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ గోపాలకృష్ణ, జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్‌పోలో ప్రతిభ

జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్‌పోలో ప్రతిభ