స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెడుతున్నారు | Sakshi
Sakshi News home page

స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెడుతున్నారు

Published Sat, May 25 2024 2:10 PM

స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెడుతున్నారు

సాక్షి, మహబూబాబాద్‌: పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెడుతున్నారని మానుకోట జిల్లాలోని కొత్తగూడ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గుగులోతు బోజ్య ఆరోపించాడు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో విలేకర్లతో మాట్లాడాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు బస్తాల దొడ్డు బి య్యం విక్రయించడానికి ద్విచక్రవాహనంపై నర్సంపేటకు తీసుకెళ్తుండగా కొత్తగూడ ఎస్సై గువ్వలబోడు వద్ద పట్టుకుని బండిని సీజ్‌ చేసి కొట్టాడు. వారం రోజుల తర్వాత పిలిచి మళ్లీ కొట్టాడు. పీడీఎస్‌ బియ్యం అమ్ముకుంటున్నట్లు కేసు పెట్టి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి మరోసారి బియ్యం విక్రయానికి పాల్పడొద్దని చెప్పి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) మళ్లీ మాట్లాడాలని స్టేషన్‌కు పిలిచాడు. భయంతో గ్రామపెద్దలను తీసుకుని వెళ్లాను. పెద్దమనుషులను బయట కూర్చోమని చెప్పి నన్ను ఎస్సై మళ్లీ కొట్టాడు. ఇలా మాటిమాటికి పిలిచి కొడుతున్నాడని బోజ్య తెలిపా రు. ఇదే విషయమై ఎస్సై దిలీప్‌ని వివరణ కోరగా తాను ఎవరిని చిత్రహింసలకు గురి చేయలేదని తెలిపారు. బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకునేందుకు విచారిస్తుండగా తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement