సమావేశంలో మాట్లాడుతున్న ధర్మభిక్షం
జనగామ రూరల్: గ్రూప్–2 పరీక్ష వాయిదా పడిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఎస్‌ఎస్‌యూ, బీఎస్‌వైఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది నుంచి ఎనిమిది మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డా రు. సమావేశంలో విద్యార్థి నాయకులు విజయ్, అఖిల్, యాకన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment