ప్రజల గుండెల్లో సీఎం రేవంత్ రెడ్డి
జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచి పోతున్నారని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి బక్త్ డే వేడుకలను జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరి కేక్ కట్ చేసిన అనంత రం మహా అన్నదాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినాన్ని ప్రజల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం మూసీ ప్రక్షాళన దిశగా పాదయాత్రకు సంకల్పించా రన్నారు. దొరల పాలన నుంచి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసి ప్రజాపాలన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు అధికారం నుంచి పక్కన బెట్టినా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురా లు బడికె ఇందిరకిష్టస్వామి, టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్కిరెడ్డి, జంగిటి విద్యానాథ్, మేడ శ్రీనివాస్, జక్కుల అనిత, నూకల బాల్‌రెడ్డి, గుర్రపు బాలరాజు, సిద్దులుపద్మ పాల్గొన్నారు.
బర్త్‌డే వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment