ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి
జనగామ రూరల్: రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించడంతోపాటు ప్రతీ మిల్లుకు ఒక పర్యవేక్షణ అధికారిని నియమించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక నోడల్ అధికారి టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రైతుల నుంచి ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయాలన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను రోజూ సందర్శించా లని సూచించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యానికి వెంటనే తూకం పూర్తిచేయాలని అన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఓపీఎంఎస్‌లో నమోదైన వివరాలను డీఎం సివిల్ సప్లయ్ అధికారి హతీరాంను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలోని సభ్యుల వివరాలు సేకరించి నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించా రు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, పౌరసరఫరాల అధికారి సరస్వతి, డీఆర్డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు.
టోకెన్ల పద్ధతి పాటించాలి..
రఘునాథపల్లి : మండల పరిధి కోమల్లలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి సందర్శించిన వినయ్‌కృష్ణారెడ్డి.. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. టోకెన్ల పద్ధతి పాటిస్తూ రైతులు రోజుల తరబడి వేచి చూడకుండా ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే స్టిక్కరింగ్‌ను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, తహసీల్దార్ మోహ్సిన్ ముజ్తబ, ఏపీఎం సారయ్య, సీసీ రీనావతి, అన్నపురెడ్డి, రాజిరెడ్డి, చంద్రయ్య, వెంకటస్వామి, రోహిణి, సువార్త, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ మిల్లుకు పర్యవేక్షణ అధికారిని నియమించాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక నోడల్ అధికారి వినయ్‌కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment